స్పీడ్ బ్రేకర్లు రైలింగ్ ఏర్పాటు చేయండి
ఎన్ ఎచ్ ఆర్ సి ఎన్ జి ఓ పెద్దపల్లి జిల్లా చైర్మన్ మాచిడి దిలీప్
మంథని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మంథని పట్టణానికి చెందిన మాచిడి దిలీప్ శుక్రవారం రోజున మంథని పట్టణంలో పలు ప్రాంతాలలో స్పీడ్ బ్రేకర్లు, రైలింగ్ లు ఏర్పాటు చేయాలని మంథని మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందజేశారు. మంథని లోని బోక్కల వాగు కట్ట పై ప్రతి రోజు ఉదయం సాయంత్రం సమయంలో వాకింగ్ చేయడానికి పాదచారులు చాలా మంది వస్తుంటారు. అదే సమయంలో కొంత మంది వాహనాలు వేగంగా వెళ్లడంతో యాక్సిడెంట్స్ జరిగి హాస్పిటల్ పాలై అప్పలపాలవుతున్నారు. మరి కొంత మంది తమ జీవితాలను కోల్పోతున్నారు. బ్రిడ్జిపై 16 గురువారం యాక్సిడెంట్లో ఓ తల్లి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధ కలిగించింది. గతంలో కూడా బొక్కల వాగు పై నుంచి వాహన చోదకులు వాగులో పడినా సంఘటనలు కూడా ఉన్నాయి. మంథని 12వ వార్డు సుభాష్ నగర్ బొక్కల వాగు కట్ట పైన ఉన్న రోడ్డు, బ్రిడ్జి వద్ద స్పీడ్ బ్రేకర్లు, రెయిలింగ్ ఏర్పాటు చేసి కొంతలో కొంతైనా ఈ ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించాలని కోరుతున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App