
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ సమావేశాలు శనివారం రాత్రి ముగిశాయి. శ్వేతపత్రంపై చర్చ అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఫిబ్రవరి 8 నుంచి 17వరకు 8 రోజులు సమావేశాలు జరిగాయి. ఈ నెల 8న గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించబోమని ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. పదో తేదీన ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌ను పెట్టింది. కులగణనపై ఈ నెల 16న తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. శనివారం నీటిపారుదల రంగంపై శ్వేతపత్రంపై చర్చ జరిగింది. ఈ సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య వాడీవేడిగా చర్చలు సాగాయి….
