TRINETHRAM NEWS

Incentives will be announced at any time

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సింగరేణి కార్మికులకు ప్రతి సంవత్సరం ఉత్పత్తి సాధించడానికి డిసెంబర్ నుండి మార్చి వరకు నాలుగు నెలలకు ఉత్పత్తి మాసాల పేరిట ప్రోత్సాహక బహుమతులు, స్పెషల్ ఇన్సెంటివ్ స్కీమును అందజేసేది. కానీ కోవిడ్ సమయంలో ప్లేడేలు పీహెచ్డీలు తగ్గించిన యాజమాన్యం తాజాగా గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రోత్సాహ బహుమతిను కూడా వాయిదా వేసుకుంటూ వస్తుంది.

ఈ సంవత్సరం సింగరేణిలోనే అత్యధిక ఉత్పత్తి పెర్మనెంట్, కాంట్రాక్టు కార్మికులందరూ కలిసి 70 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించడం జరిగింది. అయినా కానీ ఇప్పటివరకు ఎలాంటి పోత్సహక బహుమతులు కానీ కనీసం ఉత్పత్తి సాధించినందుకు అభినందనగా స్వీట్ బాక్సులు కానీ ఇవ్వకపోవడంతో కార్మికులు పేదవి విరుస్తున్నారు.

ఈ విషయంపై ప్రతిపక్ష యూనియన్లు లేవనెత్తగా అనధికారికంగా గుర్తింపు సంఘంగా కొనసాగుతున్న ఏఐటియుసి యాజమాన్యంతో సంప్రదింపులు జరిపామని త్వరలో ప్రకటిస్తుందని చెప్పి రెండు మాసాలు గడిచిన ఇప్పటివరకు అతిగతి లేదు.

జూన్ 2న జరగనున్న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగానైనా యాజమాన్యం ప్రకటించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తుంది, గత సంవత్సరమే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించిన టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అద్భుత ప్రగతి పేరిట ఒక బుక్ లెటర్ కూడా ప్రచురించి కార్మికులందరికీ ఇవ్వడం జరిగింది దానితో పాటే స్వీట్ బాక్స్ను కూడా అందజేశారు.

ప్రభుత్వం మారిన నేపథ్యంలో యాజమాన్యం కార్మికులందరికీ లాభాలవాటతోపాటు ప్రోత్సాహ బహుమతులు ప్రకటించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు కోరుతుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Incentives will be announced at any time.