TRINETHRAM NEWS

తెలంగాణలో ఇయ్యర మయ్యర ఇగం

హైదారాబాద్‌:డిసెంబర్‌ 21
రాష్ట్రంలో చలి క్రమంగా పెరుగుతున్నది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోద వుతున్నాయి.

రాష్ట్రమంతటా ఉదయం 9 గంటల వరకు మంచు దుప్పటి కప్పుకుంటున్నది. దీంతో వాహనదారులకు ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో చలిగాలులు మరింత ఎక్కువగా వీచే అవకాశం ఉన్నదని వాతా వరణ శాఖ అంచనా వేసింది.

ముఖ్యంగా ఉత్తర తెలంగా ణలో చలి ఎక్కువగా ఉన్న ది. ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం పలుచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఆదిలాబాద్‌లో గడిచిన 24 గంటల్లో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. ఆదిలాబాద్‌ జిల్లా బేలలో ఉష్ణోగ్రతలు 9.4 డిగ్రీల కనిష్ఠానికి పడిపోయాయి.

కుమ్రంభీం జిల్లా సిర్పూర్‌ యూ లో 10.4, నిర్మల్‌ జిల్లా పెంబిలో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, మంచిర్యాల జిల్లా భీమిని లో 14.8గా ఉన్నది. సోమ వారం వరకు చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

సాధారణంగానే డిసెంబర్‌, జనవరిలో అత్యల్ప ఉష్ణో గ్రతలు నమోదవు తాయి. ఈ నేపథ్యంలో దక్షిణ తెలం గాణలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతు న్నాయి.

రానున్న రెండు రోజులు ఉమ్మడి ఆదిలాబాద్‌లో 11 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోద య్యే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ పేర్కొ న్నది.

మరోవైపు గ్రేటర్‌ పరిధి లోనూ చలి వణికిస్తున్నది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 28.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15.7 డిగ్రీలు.. గాలిలో తేమ 47 శాతంగా నమోదైనట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

రానున్న రోజుల్లో చలి తీవ్ర త మరింత పెరిగే అవకా శాలున్నట్టు అధికారులు వెల్లడించారు….