సల్బత్తాపూర్ గ్రామంలో, నాసిరకంగా సీసీ రోడ్ల నిర్మాణం, నిమ్మకు నిరె త్తినట్లు అధికారులు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తూన్న పంచాయతీ రాజ్ అధికారులు,తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి.
వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం,సల్బత్తాపూర్ గ్రామంలో నాసిరకంగా సీసీ రోడ్లు నిర్మించారు కాంగ్రెస్ నాయకులు. ఇదేంటని మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగితె మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని సమాదానం ఇచ్చారు. అదేవిదంగా ఈ సీసీ రోడ్ల నిర్మాణంలో, ఇసుక లేకుండా, కేవలం కంకర డస్ట్ తో,క్వాలిటీ లేకుండా వేశారు.గ్రామస్తులు, యూవకులు ప్రశ్నించగా మాకు వికారాబాద్ ఎమ్మెల్యే, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, 30 లక్షల రూపాయాల పనులే ఇచ్చారు, మరి ఎం చెయ్యాలి, మా ఇష్టం ఉన్నట్టు వేస్తాము, మాకు కూడా మిగలాలి కదా అన్నట్టు నిస్సందేహ్యాంగా సమాధానం చెప్పడం జరిగింది.
ఈ రోడ్ల నిర్మాణం విషయంలో,పంచాయతీ అధికారులు సీసీ రోడ్లను పరిశీలించి, క్వాలిటీ కంట్రోల్ కు షాంపుల్ పంపించి, తగు చర్యలు తీసుకోవాలన్నారు.ఒక బంట్వారం మండలంలోని గ్రామాలు కాకుండా, వికారాబాద్ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీ లలో, నాసిరకంగా సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. పంచాయతీ రాజ్ డి ఈ, ఈ ఈ, లు, తగు విచారణ జరిపి, క్వాలిటితో సీసీ రోడ్ల నిర్మాణం జరిగేలా చూడాలని అన్నారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేస్తామని హెచ్చరించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App