
Trinethram News : ఏపీలో హాఫ్ డే స్కూల్స్ నిర్ణీత సమయం కంటే ముందే ప్రారంభం కానున్నాయా? మండే ఎండలకు విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందా? అనే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఏపీలో ఈసారి ఒంటి పూటలు బడులు కాస్త ముందుగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది
మండుతున్న ఎండల నేపథ్యంలో.. ప్రభుత్వం ఇదే విషయంపై ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్నారు. దీంతో ఒంటి పూట బడుల ప్రస్తావన వచ్చింది. అధికారులు కూడా ఈ అంశాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఈ ఏడాది కూడా అలానే ముందుగా స్టార్ట్ చేయాలని విద్యార్థి సంఘాలతో పాటు తల్లిదండ్రలు కోరుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం త్వరగా అధికారిక ప్రకటన చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో మార్చి మొదటి వారం అనంతరం.. మార్చి 10వ తేదీ నుంచి ఒంటి పూట బడులు ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అనధికారికంగా తెలిసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
