TRINETHRAM NEWS

Important orders of High Court on BC Caste Census

Trinethram News : తెలంగాణలో బీసీ కులగణన త్వరగా జరిగేలా చూడాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ.హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈరోజు ఆ పిటిషన్ పై ధర్మసం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు వాదనలు వినిపించారు నాగుల శ్రీనివాస్ యాదవ్. ఈ క్రమంలో పిటిషనర్ వాదనలకు సానుకూలంగా స్పందించిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. మూడు నెలల్లో బీసీ కుల గణన చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ నివేదికను కోర్టుకు సమర్పించాలని కోరింది.

తెలంగాణలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేదే దానిపై చర్చ జోరుగా జరుగుతోంది. ఇప్పటికే సర్పంచుల పదవి కాలం ముగిసిన ఇంకా ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ను ప్రభుత్వం ప్రకటించలేదు. కాగా కులగణన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తో సహా పలువురు కీలక నేతలు ఇప్పటికే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే, స్థానిక సంస్థలు ఎన్నికలు వెంటనే జరపాలని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వానికి ఒత్తిడి వస్తోంది. అయితే, దసరా తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా హైకోర్టు కూడా బీసీ కులగణనపై ఆదేశాలు ఇవ్వడంతో దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు తలనొప్పిగా మారాయనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో స్థానికంగా కాంగ్రెస్ కు వ్యతిరేకత మొదలైంది. సెప్టెంబర్ నెలలో సగంలోకి వచ్చిన ఇంకా రైతు భరోసా (రైతు బంధు) నిధులను ఇంకా విడుదల చేయకపోవడంతో రైతుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. అలాగే రైతు రుణమాఫీ జరిగిందని కాంగ్రెస్ చెప్పుకున్నారు.. వాస్తవానికి వస్తే గ్రామాల్లో సగం మందికి కూడా రుణమాఫీ జరగలేదనే చర్చ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యతిరేకతతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికకు వెళ్తే పెద్ద దెబ్బ తగిలేలా కనిపిస్తోందని కాంగ్రెస్ అధిష్టానానికి నేతలు చెబుతున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Important orders of High Court on BC Caste Census