TRINETHRAM NEWS

Trinethram News : నాగార్జున సాగర్ వివాదం నేపథ్యంలో కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేడు కీలక సమావేశం జరగనుంది. ఏపీ, తెలంగాణ జల వనరుల శాఖ అధికారులతో జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ భేటీ కానున్నారు.

శ్రీశైలం ,నాగార్జునసాగర్ డ్యాంల నిర్వహణ బాధ్యతలు కృష్ణా బోర్డుకు అప్పగించడంపై ప్రధానంగా చర్చ జరగనుంది.

ఈ భేటీలో నీటి వాటాలు, వరద జలాల మళ్లింపు తదితర అంశాలపై చర్చలు జరపనున్నారు.