TRINETHRAM NEWS

ప్రభుత్వ ఉపాధ్యాయులకు కీలక ఆదేశాలు!

Trinethram News : హైదరాబాద్‌ : డిసెంబర్‌ 10 : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు సరిగ్గా విధులకు హాజరు కావడం లేదని, అధికారులకు సమాచారం వచ్చింది, ఈ మేరకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది,

ఆయా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల ఫొటోలను అందరికీ కనిపించే విధంగా బడుల్లో ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ ఈవీ నరసింహారెడ్డి తెలిపారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అలాగే కొన్ని పాఠశాలల్లో ప్రభుత్వం నియమించిన టీచర్ల స్థానంలో ఇతర ప్రైవేట్ వ్యక్తులు పనిచేస్తు న్నారని, విద్యాశాఖకు ఫిర్యాదులు అందాయని. ఇలా ఒకరికి బదులు మరొకరు పనిచేస్తున్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు తమ ఫొటోలను ఆయా పాఠశాలల్లో ప్రదర్శించాలని కేంద్ర విద్యాశాఖ పలు మార్లు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కూడా పాఠశా లల్లో టీచర్ల ఫొటోలు ప్రదర్శించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

ఖమ్మం జిల్లాలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో కొందరు సీనియర్‌ టీచర్లు ఆయా గ్రామాలకు చెందిన యువతీ యువకులకు రూ.10 వేల వరకు ఇచ్చి, వారిని బోధకులుగా నియ మించినట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఇదే తరహాలో హైదరాబాద్‌ తోపాటు..,

మరికొన్ని జిల్లాల్లో ఉపా ధ్యాయులకు ఇతర డ్యూటీ (ఓడీ) సౌకర్యం లేకున్నా పాఠశాలలకు నెలల తరబడి హాజరు కావడం లేదన్న ఆరోపణలు వెళ్లువె త్తుతున్నాయి. హైదరాబాద్‌ పాతబస్తీ ప్రాంతంలో ఇదే మాదిరి ప్రైవేట్ వ్యక్తులు టీచర్లుగా పనిచేస్తున్నట్లు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.

ఈ విధమైన తప్పిదాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, తప్పనిసరిగా అన్ని పాఠశాలలు తమ ప్రాంగణాల్లో అక్కడ పనిచేసే టీచర్ల ఫొటోలను ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ అదేశించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App