పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడేలా కామన్ డైట్ కార్యక్రమం అమలు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
*విద్యార్థులకు, తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేలా చర్యలు
*40% డైట్ చార్జీలు, 200% కాస్మెటిక్ చార్జీలను ప్రజా ప్రభుత్వం పెంచింది
*యంగ్ ఇండియా సమీకృత విద్యాలయాలతో విద్యార్థులకు సకల సౌకర్యాలు
*గ్రీన్ ఛానల్ ద్వారా గురుకులాలకు సంబంధించిన బిల్లుల చెల్లింపు
భూపతి పూర్ బాలుర బీసీ రెసిడెన్షియల్ పాఠశాల జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి భోజనం చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే
పెద్దపల్లి, డిసెంబర్ 14: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రాష్ట్రంలో పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడేలా ప్రజా ప్రభుత్వం కామన్ డైట్ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు.
శనివారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్ మండలం భూపతి పూర్ లోని బాలుర బిసి గురుకుల పాఠశాల & జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి విద్యా బోధన, వసతి సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు.
కామన్ డైట్ మెన్యు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే కు బ్యాండ్ మేళాలు వాయిద్యాలు వాయిస్తూ జిల్లా అధికారులు గురుకుల పాఠశాల సిబ్బంది విద్యార్థులు పూలు జల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు.
ప్రభుత్వం పెంచిన మెస్ చార్జీలకు అనుగుణంగా రూపొందించిన కొత్త డైట్ మెన్యూ ను ఎమ్మెల్యే ప్రారంభించారు పాఠశాలలోని విద్యార్థులు తల్లిదండ్రుల అభిప్రాయాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ, మానవ వనరులే రాష్ట్రంలోని బలమైన వనరులని, వీరి అభివృద్ధి తోనే రాష్ట్ర అభివృద్ధి దాగి ఉందని అన్నారు. ప్రపంచంతో పోటీపడే విద్యార్థులను తయారు చేసేందుకు ప్రజా ప్రభుత్వం దృడ నిశ్చయంతో అడుగులు వేస్తుందని, మంచి పౌష్టికాహారం తీసుకుంటేనే పిల్లల దేహా దారుఢ్యం, మేదస్సు ఎదుగుదల నమోదు అవుతుందని అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ధైర్యం చేసి డైట్ చార్జీలను గణనీయంగా పెంచి, నూతన డైట్ ప్రవేశ పెట్టామని అన్నారు.
ప్రభుత్వం తమ కోసం ఉందనే నమ్మకం చదివే పిల్లలకు, తల్లిదండ్రులకు కలగాలని ఉద్దేశంతో కామన్ డైట్ లంచ్ కార్యక్రమం చేపట్టామని, ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు.
పిల్లలకు అందించే పౌష్టికాహారం, పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులు అంశంలో గత పది సంవత్సరాలలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని అన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డైట్ చార్జీలు పెరగకపోవడం వల్ల విద్యార్థులకు పౌష్టికాహారం అందించలేక ఉపాధ్యాయులు చాలా కష్టాలు పడ్డారని , వీటిని గమనించిన ప్రజా ప్రభుత్వం కమిటీ వేసి పెరిగిన ధరలకు అనుగుణంగా 15 రోజులలో నివేదిక తప్పించుకొని 40 శాతం డైట్ చార్జీలు పెంచామని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీలు కాస్మోటిక్ చార్జీలు రాష్ట్రంలోని 8 లక్షల మంది విద్యార్థులకు ఉపయోగపడతాయని, దీని వల్ల ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం 470 కోట్లు అదనపు భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఖజానా పై భారం పడిన పిల్లల భవిష్యత్తు కోసం భరిస్తున్నామని, వైద్యులతో సంప్రదించి పిల్లల ఆరోగ్యంగా ఎదిగేందుకు అవసరమైన పోషకాలు అందించేలా కామన్ డైట్ కార్యక్రమం అమలు చేస్తున్నామని అన్నారు.
విద్యార్థులకు ప్రపంచ స్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ యంగ్ ఇండియా సమీకృత విద్యాలయాలను నిర్మిస్తున్నామని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో పిల్లలకు కల్పించే సౌకర్యాలు తల్లిదండ్రులకు తెలియాలనే ఉద్దేశంతో ఈ రోజు వారిని ఆహ్వానించామని అన్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడే నాటికి నెలల తరబడి గురుకులాల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వీటిని పరిశీలించి పూర్తి స్థాయిలో క్లియర్ చేశామని అన్నారు. గురుకులాలకు గ్రీన్ ఛానల్ ద్వారా వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టామని, ఇకపై నాణ్యతతో కూడిన వస్తువులు మాత్రమే సరఫరా చేయాలని, ఎక్కడ నాణ్యత లోపించిన ఉపేక్షించ కుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App