
డిండి(గుండ్లపల్లి) మార్చి30. త్రినేత్రం న్యూస్. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు డిండి ఎస్సై రాజు వెల్లడించారు.
ఈ కేసుకు సంబంధించి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అందించిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను నంబర్ 1 టీజీ 31 ఏ 0655 మరియు2, టీఎస్ 31 ఏ 56 58 లను పట్టుకొని డ్రైవర్ల పై కేసు నమోదు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలియజేశారు.
ఇట్టి అక్రమ ఇసుకను డిండి చింతపల్లి వంగూరు మండలం నుండి తరలిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరైనా అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టారీత్యా చర్యలు తీసుకోబడుతుందని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
