TRINETHRAM NEWS

ఇందారం నుంచి బెల్ట్ షాపులకు అక్రమ మద్యం తరలింపు

జైపూర్ బ్లూ కోట్ పోలీసుల అదుపులో వాహనం

మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మంచిర్యాల జిల్లా ఇందారం నీలిమ వైన్స్ నుంచి బెల్ట్ షాపులకు అక్రమంగా మద్యం తరలిస్తుండగా జైపూర్ బ్లూ కోట్ పోలీసులు TS 18 T 2722 నంబర్ గల వాహనాన్ని పట్టుకున్నారు. ఈ వాహనం ముదిరాజులకు సబ్సిడీ కింద చేపల వ్యాపారానికి అందించబడినదిగా గుర్తించారు.

డ్రైవర్లు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఇందారం నుంచి టేకుమట్ల బెల్ట్ షాపులకు మద్యం తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఈ ఘటనపై సబ్సిడీ వాహనాల దుర్వినియోగంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎక్సైజ్ శాఖ సీఐకి సమాచారం అందించినప్పటికీ, వారు స్పందనలో జాప్యం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. “మాకు సమాచారం రావాలి, అది నిజమా కాదా అన్నది నిర్ధారించుకోవాలి” అని సీఐ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే, రామగుండం సీపీకి సమాచారం అందించగానే, ఆయన వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు వివరాలు తెలియజేశారు. 20 నిమిషాల్లోనే జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లూ కోట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్ల విచారణ చేపట్టి వివరాలు నమోదు చేస్తున్నారు.

ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది. సబ్సిడీ వాహనాలను ఇతర అవసరాలకు వినియోగిస్తున్న దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App