ఐ ఎఫ్ టి యు ల విలీన సభ పోస్టర్ ఆవిష్కరణ.
భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
బలమైన విప్లవ కార్మికో ద్యమ నిర్మాణం,విస్తరణ కై జనవరి 18న కొత్తగూడెం లో నిర్వహించే ఐ ఎఫ్ టి యు ల విలీనా సభను జయప్రదం చేయాలని కోరుతూ గోదావరిఖని గంగా నగర్ లోని లారీల అడ్డ వద్ద.లైన్ లారీ డ్రైవర్ కార్మికుల తో పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రవి కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా కుదించి కార్మిక హక్కులను కాల రాస్తుందని విమర్శించారు. ప్రభుత్వరంగ పరిశ్రమల పరిరక్షణకై ఉద్యమించాలని, ప్రైవేటీకరణ,కార్పొ రేటికరణ విధానాలను ప్రతిఘటించాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
జనవరి 18న కొత్తగూడెం లో నిర్వహించే ఐ ఎఫ్ టి యు ల విలీన సభ,ర్యాలీకి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు ఎం మహిపాల్,అసంపల్లి సతీష్, గజ్జల వెంకటి,జనగాం రాజన్న,ఆకుల సురేష్, ఎస్ సత్యనారాయణ,దివాకర్, అనీల్ దుబ్బ రాజయ్య,ఏనుగంటి సతీష్ (లడ్డు)తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
ఎడ్ల. రవికుమార్
ప్రధాన కార్యదర్శి
*తెలంగాణ ప్రగతి శీల ఆటో& మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ (ఐ ఎఫ్ టి యు)
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App