
Trinethram News : కాకినాడ,ఫిబ్రవరి,18: ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన ఆందోళన పిలుపులో భాగంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి తుపాకుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం కాకినాడలో నగరపాలక సంస్థ మున్సిపల్ అదనపు కమిషనర్,కి వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ అదనపు కమిషనర్,కి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సమస్యలు పరిష్కరించాలని, ఫిబ్రవరి 17వ తేదీ న కమిషనర్ లకు వినతిపత్రం అందచేయాలని, ఫిబ్రవరి 19వ తేదీన స్థానిక ఎమ్మెల్యే, కి వినతిపత్రం అందజేస్తామని, కాకినాడలో ఉన్న మస్తర్ల కార్యాలయం వద్ద నిరసన ఆందోళన నిర్వహిస్తామని, ఫిబ్రవరి 14వ తేదీన కాకినాడ నగరపాలక సంస్థ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన ఆందోళన చేపడుతామని ఆయన తెలియజేశారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆప్కాస్ ను రద్దుపరిస్తే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను తక్షణమేపర్మినెంట్ పర్మినెంట్ చేయాలని, వీటిని ప్రైవేటు వ్యక్తులకు అంటే బడా కంపెనీలకు, ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పుదామని మంత్రి వర్గ సభ్యుల అభిప్రాయాలు పత్రికల్లో ప్రకటించడంపై ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆందోళన చేయాలని పిలుపునిచ్చిందని, ఆ పిలుపులో భాగంగానే ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16 వరకు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంది జరగనున్న సందర్భంగా ప్రభుత్వం దృష్టికి మా సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించుకోవడానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పోరాటానికి కార్మికుల సనదిద్దం కావాలని పిలుపునిచ్చారు.
ఫిబ్రవరి 17 నుండి మార్చి 3 వరకు దశలు వారి ఆందోళన నిర్వహిస్తామని, మార్చి 6న చలో విజయవాడకు కార్మికులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మున్సిపల్ పారిశుద్ధ్య, ఉద్యోగ కార్మికుల వేతనాలు పెంపుదల చేయాలని, ప్రైవేట్ కంపెనీ ఏజెన్సీ కుఅప్పచెప్పద్దని, కాంట్రాక్టర్స్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, 15 సంవత్సరాల స్కూల్స్ స్వీపర్ల వేతనాల పెంచలేదని, సత్వరమే వీరి వేతనాలు పెంచాలని, ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న మరణించిన, రిటైర్మెంట్ అయినవారిస్థానంలో వారి కుటుంబ సభ్యులకు పనులు కల్పించాలని, రెగ్యులర్ ఉద్యోగ కార్మికుల వలె అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులు రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలుకు పెంచాలని ,తదితర డిమాండ్ల సాధనకే ఫిబ్రవరి 24వ తేదీన కాకినాడ నగరపాలక సంస్థ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా జరుగుతుంది అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
