TRINETHRAM NEWS

కొంకటి లక్ష్మీనారాయణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని పట్టణంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలను తొలగించకుండా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడుతానని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో, శనివారం ఎన్టిపిసి జ్యోతిభవన్ లో కలిసి రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాలు, దళిత వర్గాల పట్ల ప్రభుత్వ అధికారుల వ్యవహరిస్తున్న కుల వివక్ష కుట్రపూరిత విషయాలపై ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకువెళ్లారు 25 సంవత్సరాల క్రితం, గోదావరిఖని,
కూరగాయల మార్కెట్ సమీపాన ఏర్పాటుచేసిన తొలి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, విగ్రహాన్ని తొలగించిన మున్సిపల్ కమిషనర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు, ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు మాట్లాడారు, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాల కూల్చివేతలు తొలగింపు విషయంలో జిల్లా కలెక్టర్ కొయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో మాట్లాడి విగ్రహాలు తొలగించకుండా చూస్తానని,హామీ ఇచ్చారు, కమిషన్ సభ్యుని కలిసిన వారిలో, ఆల్ ఇండియా అంబేద్కర్ యువ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి, లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ తదితరులు ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App