
అక్రమ సంబంధం కోసం కన్న తండ్రినే కడతేర్చిన కూతురు
మూడు రోజుల్లోనే ముద్దాయిలను అరెస్ట్ చేసిన టౌన్ సీఐ సురేష
(మండపేట త్రినేత్రం న్యూస్) మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. పడక సుఖం కోసం ఏకంగా కన్నతండ్రి నే కడతేర్చిన కూతురు ఉదంతమిది. చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేసిన తండ్రి కంటే అక్రమ సంబంధమే తనకు ఎక్కువనుకుంది. ఆపై ప్రియుడి తో కలిసి పథకం ప్రకారం తండ్రి నీ హత్య చేయించింది. అయితే చట్టం నుండి మాత్రం తప్పించుకోలేకపోయింది. మండపేట టౌన్ సీఐ డి. సురేష్ చాకచక్యంగా వ్యవహరించి ఘటన జరిగిన మూడు రోజుల్లోనే నిందితులను పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఘటనకు సంబంధించి మండపేట టౌన్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
మండపేట మేదరిపేట కు చెందిన సురా రాంబాబు కు వస్త్రాల వెంకట దుర్గా అనే కూతురు వుంది. ఈమెకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త, పిల్లలతో కలిసి తండ్రి ఇంటి వద్దే వుండేది. ఇదిలా వుండగా రామచంద్రపురం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ముమ్మిడివరపు సురేష్ మేకల కబేలా పని నిమిత్తం మండపేట వచ్చేవాడు. ఈక్రమంలో అతనికి దుర్గతో అక్రమ సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లకు విషయం తెలియడంతో భర్త ఆమె నుండి విడిపోయి అదే వీధిలో వేరొక ఇంటిలో ఒక్కడే నివాసం ఉంటున్నాడు. అయినప్పటికీ దుర్గా తీరులో మార్పు కనిపించకపోవడంతో ఇది మంచి పద్ధతి కాదని తండ్రి రాంబాబు కూతురు దుర్గను గట్టిగా మందలించాడు.
అయితే తండ్రి చేయి చేసుకున్నాడన్న కోపం తో పాటు తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే అక్కసుతో ఎలాగైనా తండ్రిని మట్టుబెట్టాలనుకుంది. ప్రతి రోజూ దుర్గా ఆమె పిల్లలు దాబాలో నిద్రిస్తుండగా దుర్గా తల్లిదండ్రులు మాత్రం సమీపంలోనే వున్న మరో పాకలో నిద్రపోయేవారు. అయితే తండ్రిని చంపేయాలని పథకం వేసిన కూతురు ముందు అక్కడ తండ్రి ఒక్కడే పడుకునేలా చేయాలనుకుంది. పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి తల్లిని తన డాబాలో పిల్లలతో పాటు పడుకునేలా చేసింది. ఈ మేరకు ఈ నెల 16న కొత్తూరు లో వున్న ప్రియుడికి ఫోన్ చేసి పాక లో తన తండ్రి ఒక్కడే నిద్ర పోతున్నాడని చెప్పి, వచ్చి చంపేయాలని చెప్పింది.
దీంతో ప్రియుడు సురేష్ తన స్నేహితుడు తాటికొండ నాగార్జున ను వెంటబెట్టుకుని మండపేట వచ్చాడు. ఆపై పాకలోకి వెళ్ళి కాళ్ళు ఒకరు పట్టుకోగా ఛాతీపై మరొకరు కూర్చుని పీక నులిమి చంపేశారు. అయితే రాంబాబు సోదరుడి పిర్యాదు మేరకు పోలీస్ లు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాలు మేరకు రామచంద్రాపురం డీఎస్పీ రఘువీర్ నేతృత్వంలో సీఐ సురేష్ దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోస్టు మార్టం రిపోర్టు లో అది హత్యగా తేలింది. పీక నులమడంతో పాటు డొక్కలొ బలంగా తన్ని గాయం చేయడంతో చనిపోయినట్లు తేలింది. దీంతో సీఐ సురేష్ దర్యాప్తు వేగవంతం చేశారు. తమదైన శైలిలో విచారణ మొదలు పెట్టారు. దీంతో అసలు నేరస్థులు బయటపడ్డారు. పక్కా ప్రణాళిక ప్రకారమే తండ్రిని చంపినట్లు కూతురు దుర్గా పోలీస్ లు ముందు అంగీకరించింది. ఈ మేరకు నిందితులు ముగ్గురిని పోలీస్ లు అరెస్ట్ చేసి రామచంద్రపురం కోర్టు కు తరలించారు.
ఓ అక్రమ సంబంధం నిండు ప్రాణాన్ని బలిగింది. తండ్రి కూతుర్ల బంధానికి మాయని మచ్చ తెచ్చి పెట్టింది. అక్రమ సంబంధం మోజులో పడి కళ్లు మూసుకుపోయి ప్రవర్తించిన ఒకడిని జీవితం నాశనమైంది. సాయానికి వచ్చినందుకు మరో స్నేహితుని జీవితాన్ని నాశనం చేసింది. ఒక్క తప్పు ఇన్ని అనర్థాలకు కారణమైంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
