
Trinethram News : ముంబై అలీబాగ్ కోస్టల్ తీరానికి దాదాపు 6 నుంచి 7 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. రాకేష్ గన్ కు చెందిన ఒక ఫిషింగ్ బోట్ అగ్నికి ఆహుతైంది.
రాకేష్ గన్ కు చెందిన ఒక ఫిషింగ్ బోట్ అగ్నికి ఆహుతైంది. సమాచారం అందిన వెంటనే ఇండియన్ కోస్టల్ గార్డ్స్, నావికాదళం అప్రమత్తమయ్యారు.
హుటాహుటీన ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని పడవలో ఉన్న 18 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించగలిగారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మునుముందు ఇలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సముద్ర భద్రతా సంస్థలను అప్రమత్తం చేశారు.
ప్రస్తుతం ఇంకా అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
