TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం హుక్కంపేట ఏప్రిల్ 2: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం హుకుంపేట మండలం రాప పంచాయతీ కె తాడి పుట్టు గ్రామంలో జనసేన పార్టీ మండల సంయుక్త కార్యదర్శి జన్ని లింగన్న ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం గ్రామంలోని సుమారు ముప్పై మందికి పైగా అరకు నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చెట్టి చిరంజీవి,మండల అధ్యక్షులు కోటేశ్వరరావు పడాల్ జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు.
కార్యక్రంలో ముఖ్య అతిధిగా అరకు నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చెట్టి చిరంజీవి, హుకుంపేట మండల అధ్యక్షులు బలిజ కోటేశ్వరరావు పడాల్ పాల్గొన్నారు. చిరంజీవి మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్క జనసైనికుడు కృషి చేయాలని కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియపరచాలని. అతి త్వరలో మేనిపెస్టో లోని ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజలు గమనించాలని కోరారు.
కోటేశ్వరరావు పడాల్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులు, రాష్ట్ర ఖజానా లూటీ తప్ప అభివృద్ధి అనేదే లేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు తీర్చడమే కాకుండ అభివృద్ధి, సంక్షేమం రెండు సమన్వయంతో బాధ్యతగా ముందుకు నడుపుతుందని అన్నారు.అలాగే వేసవిలో పశువులకు తాగునీటి కుండీలు నిర్మాణం, P4 వంటి అంశాలపై ఏకాతాటికి తీసుకొచ్చేల ప్రణాళిక చేయడం,ఉప ముఖ్యమంత్రి గారి చొరవతో నేడు పల్లె పండగ వాతావరణంలో అభివృద్ధి జరగడం,గిరిజన పల్లెలకు స్వాతంత్ర్య యోధుడు అల్లూరి సీతారామరాజు ట్రస్ట్ ద్వారా సొంత నిధులతో అనేక కార్యక్రమాలతో అభివృద్ధి చేయడం గిరిజన ప్రజలు గమనించాలని కోరారు.
కార్యక్రమంలో మండల నాయకులు జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శోభ రాంబాబు దొర, బూడిద నాగరాజు, కార్యదర్సులు శరభ ప్రసాద్, డుంబేరి చిరంజీవి, జన్ని సతీష్,పాంగి నరసింగరావు, మజ్జి రామకృష్ణ, బాకూరు కామేశ్వరరాజు, జనసైనికులు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Huge additions to Janasena