ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్ ( కొయ్యూరు మండలం ) జిల్లాఇంచార్జ్ : అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం, ఆడాకుల పంచాయితీ, ఆడాకుల గ్రామానికి చెందిన, 36 మంది గిరిజనేతరులు తమ పేర్లు వెబ్ ల్యాండ్ లో నమోదు చేసి, వారికి పట్టా పాసు పుస్తకాలు ఇప్పించాలని జిల్లా కలెక్టర్ కి అర్జీ పెట్టుకున్నారు. దీంతో ఎవరికైనా, ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయో లేదోనని గ్రామసభ నిర్వహించి తదుపరి వివరాలు సమర్పించాలని జిల్లా స్థాయి అధికారులు ఆదేశాలు జారీచేశారు. దీంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజన్న దొర ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించగా వారి,వారి సమస్యలు గిరిజనేతరులు వివరించగా, విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న గిరిజనులు 5వ షెడ్యూల్ పరిధిలో ఉన్న గిరిజనేతరులకు వారి పేర్లు వెబ్ ల్యాండ్ లో నమోదు చేసి పట్టా పాసు పుస్తకాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గిరిజనులు తమ పూర్తి అభ్యంతరం తెలియజేశారు.గిరిజనేతరులకు పట్టా పాసు పుస్తకాలు ఇవ్వడం కుదరదని అన్నారు.ఈ విషయమై పూర్తి స్థాయిలో చర్చించేందుకు మరొక రోజు నిర్ణయించాలని ఆదివాసీ గిరిజన ప్రజా సంఘాలు పాల్గొనడం జరుగుతుందని, కనుక ఈ గ్రామసభను వాయిదా వేయాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ ని గిరిజన సంఘాల నాయకులు కోరారు. అలాగే ఈ గ్రామసభ ముందు సజావుగా సాగినప్పటికీ కొంతసేపటి తరువాత గిరిజనులకు, గిరిజనేతరులకు మధ్య గొడవ రసాభాసగా మారింది. దీంతో ఈ గ్రామసభ వాయిదా వేసి తదుపరి తారీకు మళ్లీ చెబుతామని ఆర్ ఐ చెప్పారు. ఈ సందర్భంగా ఆదివాసీ ప్రజా చైతన్య సంఘం అధ్యక్షుడు పాడి లోవరాజు, ఆదివాసీ జేఏసీ రాష్ట్ర మహిళా నాయకురాలు శ్యామల వరలక్ష్మి, మీడియాతో మాట్లాడుతూ గిరిజనేతరులకు పట్టా పాసు పుస్తకాలు ఇచ్చే విషయంపై తీవ్రంగా ఖండించారు.గిరిజనేతరులకు పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే కొయ్యూరు జెడ్పీటీసీ వారా నూకరాజు వారికి సహకరిస్తూ గ్రామసభలో మాట్లాడటం సమంజసం కాదన్నారు.గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులకు పట్టాలు మంజూరు చేయడం వీలు కాదని తెలిసి కూడా గ్రామసభ పేరుతో ఎంక్వయిరీకి జిల్లా కలెక్టర్,సబ్ కలెక్టర్ తదితర జిల్లా స్థాయి అధికారులు ఏవిధంగా పంపిస్తారని జేఏసీ నాయకులు అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App