
తేదీ : 25/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం , గ్రామం ఏ కొండూరు వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్నటువంటి వైయస్సార్ విగ్రహం ఆపోజిట్ ఉన్నటువంటి శ్రీనివాస్ నగర్ చర్చికి వెళ్లే సిమెంట్ రోడ్లో మరియు ప్రతి చోట కూడా కోతులు బెడద ప్రతిరోజు వె క్కువైపోతుంది. అదేవిధంగా పిచ్చికుక్కల బెడద మనుషులను భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది.
ఇళ్లల్లో మనుషులు బయటికి రావాలన్నా, ఏదైనా ఒక పని నిమిత్తం సెంటర్ కి వెళ్ళాలన్నా కోతులకు, కుక్కలకు భయభ్రాంతులకు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. గుంపులుగా వచ్చి కోతులు మనుషుల మీద పడి రెక్కడం, లేదా కరవడం జరుగుతుంది.కుక్కలు కూడా అదే పని.
చిన్న పెద్ద ముసలి తేడా లేకుండా వాటికి గురై వైద్యశాలకు వెళ్లి టిటి ఇంజక్షన్లు మరియు మందులు వాడడం జరుగుతుంది. నల్లకుంట్ల .శిరీష అనే ఆమెను, కొంతమందిని కోతులు మరియు కుక్కలు గాయపరచడం జరిగింది. అనంతరం వాళ్లు వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందారు. ఎన్నాళ్ళు ఎన్నేళ్లు ఈ ఇబ్బందులని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
గ్రామ సర్పంచు మరియు వారి సిబ్బంది కూటమి నాయకులు కలిసి కోతులు , పిచ్చికుక్కలు లేకుండా చెయ్యాలని వేడుకోవడం జరిగింది. తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
