
Trinethram News : ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు సంబంధించి గతంలో దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణలో భాగంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలోని పోలీస్‌స్టేషన్లు, జైళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఎన్ని పని చేస్తున్నాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పని చేయని వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం కానీ వాటికి మరమ్మతులు చేయడానికి ఏమి చర్యలు తీసుకున్నారని అడిగింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు చేశారా? అని ప్రభుత్వాన్ని సూటిగా నిలదీసింది. అలాగే పోలీస్టేషన్లలో ఆ ప్రాంగణమంతా కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా? లేదా? అని ప్రశ్నించింది. ఈ అంశాలను పరిశీలించి రాష్ట్ర స్థాయిలో ఐటీ విభాగాన్ని చూసే ఉన్నతాధికారికి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
రాష్ట్రవ్యాప్తంగా1,392 పోలీస్ స్టేషన్లు ఉండగా వాటిలో 1001 స్టేషన్లలో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని న్యాయమూర్తి ఈ సందర్భంగా వివరించారు. అదే విధంగా రాష్ట్రంలోని 81 జైళ్లలో 1,226 కెమెరాలు ఏర్పాటు చేయగా.. వాటిలో 785 మాత్రమే పని చేస్తున్నాయన్న హైకోర్టు స్పష్టం చేసింది. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల అనుసరించి.. కనీసం 12 నెలల పాటు సీసీ ఫుటేజ్ భద్రపరచాలని చెప్పింది. ఫుటేజ్ బ్యాకప్ కోసం జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏదైనా వ్యవస్థ ఏర్పాటు చేశారా? అనేదాని పై వివరాలను అఫిడవిట్లో చెప్పాలని న్యాయస్థానం ఆదేశించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
