ఏలూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..
ఏలూరు జిల్లా మండవల్లి మండలం బైరవపట్నం లో భారీ అగ్ని ప్రమాదం
పక్షులను వేటాడే వేటగాళ్లకు చెందిన 20 ఇళ్లు దగ్ధం.
పక్షులను బెదిరించే నాటు తుపాకీ లో వాడే మందు గుండు సామాగ్రికి అంటుకున్న దోమల అగరబత్తీ… చెలరేగిన నిప్పురవ్వలు.
నివాసాల్లోని గ్యాస్ సిలిండర్లు పేలడంతో మరింత పెరిగిన ప్రమాద తీవ్రత.
అగ్నికీలల ధాటికి పూర్తిగా కాలి బూడిదైన ఇళ్లు.ప్రమాదంలో ఆరుగురుకి తీవ్రగాయాలు.ముగ్గురు చిన్నారులు, ఒక మహిళ
బాధితులు కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
Trinethram News : ఏలూరు : మండవల్లి మండలం పత్తిపాడు భైరవపట్నంలో అగ్ని ప్రమాదం సంభవించింది. గ్యాస్ లీకేజీ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమీపంలోని 30 గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు, ఓ మహిళ సహా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కైవలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App