TRINETHRAM NEWS

భూపాల్,సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ హాజరై మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి సంబందించిన 400 ఎకరాల భూమిని ఈమధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి సిద్దపడింది.
దీన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తే వాటిని అణచివేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో విద్యార్థులపై జులుం చేయించింది.
దీన్ని నిరసిస్తూ విద్యార్థులకు అండగా సిపిఎం రాష్ట్ర కమిటీ యునివర్సిటీ ప్రధానగేటు ముందు నిరసన చేయడం జరిగింది. పోలీసులు వచ్చి నాయకులపై, విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించి సుమారు 430 మందిని అరెస్టు చేసి కేసులు పెట్టినారని అన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నిరసనలు పిలుపివ్వడం జరిగింది. అందులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన తెలుపడం జరిగింది.
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నేషనల్ మొనిటైజేశన్ పైప్ లైన్ పేరుతో ప్రభుత్వ భూములు ప్రైవేటు వారికి కట్టబెడితే మేమేం తక్కువ కాదన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి సంబందించిన 400 ఎకరాల భూమిని ప్రైవేటు వారికి అప్పచెప్తుందని ఈ విధానాన్ని విరమించుకోవాలని అన్నారు.
లేకుంటే భవిష్యత్ లో ఆందోళనలు ఉదృతం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వంను హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి, రామా చారి, జిల్లా కమిటీ సభ్యులు మేదరి సారయ్య, బిక్షపతి, గణేష్, ఎస్.రవీందర్, నాయకులు తుమ్మల రాజా రెడ్డి, నెర్వట్ల నర్సయ్య,నాగమణి, లక్ష్మా రెడీ,నరహరి తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

HCU land auction should