TRINETHRAM NEWS

రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజలకు, పోలీస్ అధికారులు‌ సిబ్బందికి 76 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

పోలీస్ కమిషనరేట్ కమిషనర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపియస్,

నిబద్దతతో, దైర్యంగా క్రమశిక్షణతో సమర్థవంతంగా పని చేయాలి

గణతంత్ర దినోత్సవ సందర్భంగా పోలీసు అధికారులతో కలిసి కమిషనరేట్ ఆవరణలో జమ్మి చెట్టు నాటిన సిపి

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) ఆవిష్కరించారు
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మన రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తితో ఈరోజు మనం స్వేచ్ఛ స్వాతంత్రాలతో అభివృద్ధి పథంలో నడుస్తూ ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాం అన్నారు. ప్రతి భారతీయుడి హృదయాల్లో ఈ రోజు ఒక ప్రత్యేకమైన దినం. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన అతిపెద్ద భారత రాజ్యాంగం స్వేచ్ఛ, ప్రజాస్వామ్య సౌభ్రాతృత్వం, దేశభక్తి ఆకాంక్షలను, న్యాయం, స్వేచ్ఛ సమానత్వం మరియు సౌభ్రాతృత్వ సూత్రాలకు సజీవ నిదర్శనం. కులమత లింగ బేధాలు లేకుండా ప్రతి పౌరునికి సమాన హక్కులు అవకాశాలు ఉండేలాగా సమాజాన్ని నిర్దేశించిన రోజు అన్నారు. ఎందరో త్యాగధనుల ఫలితం గణతంత్ర దినోత్సవం వారిని ఎప్పుడూ మనం స్మరిస్తూ ఉండాలి, వారి త్యాగఫలం , ప్రాణాలను త్యాగం చేయడం ద్వారా మనం ఈరోజు స్వేచ్ఛ స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపారు. మన రాజ్యాంగాన్ని ఆమోదించిన ఏడు దశాబ్దాలలో భారతదేశం అన్ని రంగాల్లో ఘనంగా ప్రగతి సాధించింది ఆర్థిక వృద్ధి, సాంకేతిక వృద్ధి, సామాజిక పురోగమన మనం చూస్తున్నాం అన్నారు. భారతదేశంలోని ఐక్యమత్యం మన దేశానికి బలమని భారతదేశంలోని సంస్కృతులు, భాషలు, సాంప్రదాయాలు, వస్త్రధారణ మనందరికీ గర్వకారణం అన్నారు. అభివృద్ధి ఫలాలు దేశంలోని ప్రతి పౌరునికి చేరేలా చేయడం మన అందరి సమిష్టి బాధ్యత భారతదేశాన్ని అతి ముఖ్యమైన దేశంగా నిర్మించేందుకు కృషి చేద్దాం మన స్వేచ్ఛతో పాటు భవిష్యత్ తరాలకు సహజ వనరుల సమకూర్చడానికి కృషి చేయాలి. అంతర్జాతీయ సమాజంలో బాధ్యతమైన పౌరునిగా భారతదేశ పర్యావరణ పరిరక్షణ అభివృద్ధిని ప్రోత్సహించడంలో ముందు ఉండాలి. గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన సరిహద్దులను కాపాడే సైనికులకు, అన్నం పెట్టే రైతులకు, సాంకేతికంగా ముందుకు నడిపిస్తున్న శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

పోలీసు విధి నిర్వహణ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి సిపి చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేయడం జరిగింది.

ఉత్క్రిష్ట సేవ పతకం

2020 సంవత్సరంలో పోలీస్ విధులలో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి చిలుకూరి వెంకటేశ్వర్లు ఏసిపి, ఎల్ లక్ష్మీనారాయణ ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్, మంథని రాజేందర్ కానిస్టేబుల్, హోంగార్డులు ఎద్దునూరి రాధాకృష్ణ ముద్దారపు గిరీష్ కుమార్, సప్తపది కిష్టయ్య లు

అతి ఉత్క్ృష్ట సేవా పతకం పొందిన హోంగార్డులు కనుకుంట్ల శివరాం, ఇటికల సమ్మయ్య, జూల ఓదెలు, కోత రాజేశం, మహమ్మద్ సాదిక్ అలీ,

2024 సంవత్సరంలో అతి ఉత్కృష్ట సేవా పతకం పొందిన వి వెంకటేశ్వర్లు ఏఎస్ఐ ట్రాఫిక్ రామగుండం, డి రవీందర్రావు ఏఎస్ఐ పెద్దపల్లి. మరియు అతి ఉత్కృష్ట సేవా పథకం పొందిన టి శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్ సిసిఆర్వి రామగుండం లకు సిపి పతకాలు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమం లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, ఏసీపీ చిలుకూరి వెంకరేశ్వర్లు, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, సుందర్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ లు, వివిధ ఇన్స్పెక్టర్ లు, ఏఓ శ్రీనివాస్ , సీఐ లు, ఆర్ ఐ లు, ఎస్ఐ, ఆర్ ఎస్ఐ లు, వివిధ వింగ్స్ సిబ్బంది, సీపీఓ సిబ్బంది, సిఎఆర్ హెడ్ క్వార్టర్ సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App