TRINETHRAM NEWS

Trinethram News : ప్రశాంత్ వర్మ- తేజ సజ్జా కాంబినేషన్‌లో వచ్చిన ‘హనుమాన్’ మూవీ వసూళ్ల పరంగా రికార్డులను తిరగరాస్తోంది.

92ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో సంక్రాంతికి విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘హనుమాన్’ నిలిచింది.

ఈ మేరకు దర్శకుడు ప్రశాంత్‌వర్మ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.

సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా కలెక్షన్ల పరంగా రూ.300కోట్లకు చేరువైంది.