
త్రినేత్రం న్యూస్ అనపర్తి
- జగన్, చెప్పింది చేశారు… బాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారు
- వైకాపా శ్రేణులు ప్రత్యక్ష పాత్రను సమర్థవంతంగా పోషించాలి
- బిక్కవోలు, రంగంపేట మండలాల వైకాపా ముఖ్యులతో సమేశంలో జిల్లా అధ్యక్షుడు వేణు,
అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, అధ్యక్షతన బిక్కవోలు రంగంపేట మండలాల పార్టీ ముఖ్య నేతలతో జరిగిన ప్రత్యేక సమావేశంలో మాజీ మంత్రి తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సభలో వేణు, మాట్లాడుతూ కూటమి ఆధ్వర్యంలో ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన పది నెలల కాలంలో తీవ్ర వ్యతిరేకతను తెచ్చుకుంది అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా పాలించిన ఐదేళ్ల కాలాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజలు చర్చించు కుంటున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి, ప్రజలకు ఏదైతే చెప్పారో చెప్పింది చేశారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఎన్నికల హామీలను తుంగలో తొక్కి మోసం చేశారు.
ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని వైకాపా నేతలు ప్రత్యక్ష పాత్ర సమర్థవంతంగా పోషించాలన్నారు. ఈ సందర్భంగా బిక్కవోలు మండల ఎంపీటీసీలు ముఖ్య నేతల ఏకగ్రీవ అభిప్రాయం మేరకు మండల ఉపాధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో బలబద్రపురం ఎంపిటిసి సభ్యురాలు సబ్బెళ్ళ సుజాతా వీర్రాఘవరెడ్డి,ని ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా దీంతోపాటు రంగంపేట మండలం కోఆప్షన్ సభ్యుని ఎన్నికకు సంబంధించి బాలవరం గ్రామానికి చెందిన కరుపోతు సత్యనారాయణ,ని మండల ఎంపిటిసిలు, ముఖ్యనేతల ఏకగ్రీవ అభిప్రాయం మేరకు, అనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మరియు మాజీ మంత్రి తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సంయుక్తంగా పైన తెలిపిన అభ్యర్థిత్వాలను ప్రకటించారు.
ఈ సమావేశంలో అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, నల్లమిల్లి మురళీ మోహన బాలకృష్ణారెడ్డి (మురళి) అనపర్తి గ్రామం వైఎస్సార్సీపి కమిటీ కన్వీనర్ , బిక్కవోలు మండల పార్టీ అధ్యక్షుడు పోతుల ప్రసాద్ రెడ్డి (బుజ్జి), కొంకుదురు సొసైటీ మాజీ అధ్యక్షుడు సత్తి నాగిరెడ్డి (రాజా), కొంకుదురు ఎంపీటీసీ పి.వి. పందలపాక గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి, కాపవరం సర్పంచ్ సత్యంశెట్టి వెంకటరమణ,పార్టీ నాయకులు గుబ్బల అలేఖ్య లాజర్ బాబు, రంగంపేట పార్టీ కన్వీనర్ నల్లా శ్రీనివాసరావు గారు, ఎంపిపి అబ్బు , జడ్పిటిసి పేపకాయల రాంబాబు , కొల్లాటి ఇజ్రాయిల్ , పడాల దుర్గ రెడ్డి , కొర్ల శ్రీను,పలువురు ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సర్పంచులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
