తేదీ : 11/01/2025.
ఘనంగా హనుమాన్ శాలీషా.
ఎన్టీఆర్ జిల్లా : ( త్రినేత్రం న్యూస్ ) :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం, తెల్లదేవరపల్లి గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గ్రామ కార్యకర్త రాయల కిషోర్ ఇంట్లో హనుమాన్ భజన కార్యక్రమం జరిగింది. ప్రతి శనివారము ఎవరో ఒకరి ఇంట్లో భజన కార్యక్రమం ఉంటుందని తెలపడం జరిగింది.
ఈ గ్రామంలో రెండు బృందాలుగా హనుమాన్ భక్తులు ఉన్నారని తెలిపారు. ప్రజలందరూ కు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రతి ఒక్కరి కుటుంబంలో సిరి సంపదలు, సంతోషం , కలిగి, అనారోగ్యం, కష్టనష్టాలు రాకుండా ఉండాలని హనుమాన్ భక్తులు తెలపడం జరిగింది. ఈ భజన కార్యక్రమంలో వచ్చిన భక్తులందరూ కు భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రెసిడెంట్ గాది. భవాని, రాయల.రమాదేవి, నాగేంద్రమ్మ, సత్యవతి, లక్ష్మి, రాణి తదితరులు పాల్గొని విజయవంతం చేసినారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App