TRINETHRAM NEWS

తేదీ : 19/02/2025. ఆళ్లగడ్డ: (త్రినేత్రం న్యూస్); విలేఖరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ మండలం లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఎగువ మరి దిగువ అహోబిలం క్షేత్రాలతో పాటు నవ నరసింహ క్షేత్రాలలో కూడా భక్తులు పాల్గొని పూజల నిర్వహించారు.

వే ద పండితులు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా సుదర్శన హోమం, పూర్ణాహుతి కార్యక్రమాన్ని ప్రధాన అర్చకులు వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఛైర్మన్ రామ్ సింగ్. క్షేత్రాన్ని దర్శించుకుని, ప్రధాన అర్చకులు పూజల నిర్వహించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Swati Nakshatra celebrations