TRINETHRAM NEWS

బోర్డు స్కూల్లో ఘనంగా గణతంత్ర వేడుకలు
త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా కంభం

కంభం: స్థానిక బోర్డు స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు వరికుంట్ల. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. అంతరం విద్యార్థుల ఆటలు,ఆలపించిన గీతాలాపనలు, నృత్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థి, దాత కనుమర్లపూడి. మురళీకృష్ణ ఆర్దిక సహకారంతో విద్యార్థులకు పలు రకాల ఖరీదైన బహుమతులను పంపిణీ చేశారు.వక్తలు తమ స్ఫూర్తి వచనాలతో దేశభక్తిని చాటుతూ గణతంత్ర లక్ష్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జేవివి. కార్యదర్శి దేవిరెడ్డి.నాగేంద్రుడు, పాఠశాల యాజమాన్య కమిటీ ఉపాధ్యక్షురాలు సాకం. ధనలక్ష్మి, ఉపాధ్యాయురాలు ఖుర్షీద్ తమీన్, ఐఈఆర్పి అరుణ్ కుమార్ పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App