రసాభాసగా గ్రామసభలు
డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26వ తేదీన అమలు చేయబోయే నాలుగు పథకాల కోసం అర్హులను గుర్తించేందుకు నిర్వహిస్తున్న గ్రామసభలు రసాభాసగా మారాయి. అర్హుల ప్రాథమిక జాబితాలు తప్పుల తడకలుగా మారాయి. ఒకచోట గ్రామసభలో ప్రకటించిన జాబితా అనే తుది జాబితా అని చెప్పుతుండగా, మరోచోట జాబితాలో వచ్చిన పేర్లే ఖరారు అయినట్లు కాదని అధికారులు సిబ్బంది చెబుతుండడం గందరగోళానికి తెరతీసింది.
ఇదే సమయంలో ప్రాథమిక జాబితాలో పేర్లు రానివారు గ్రామసభల్లో దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. 20 23 డిసెంబర్ నెలలో నిర్వహించిన ప్రజా పాలనలో గత సంవత్సరం నిర్వహించిన కులగనణ సర్వేలోనూ తమకు ఇల్లు లేదని, రేషన్ కార్డు లేదని వెల్లడించామని అయినా మళ్లీ దరఖాస్తు చేసుకోవడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామసభల్లో దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను ఎప్పుడు ఖరారు చేస్తారు అంటూ స్థానిక అధికారులను ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోవడం మరింత ఇబ్బందిగా మారింది. జనవరి 26న అమలు చేయబోయే పథకాల అర్హుల జాబితాలో తమకు అవకాశం ఉంటుందా లేదా అని గ్రామసభల్లో దరఖాస్తు చేసుకుంటున్న వారు వాపోతున్నారు.
పలుచోట్ల ఘర్షణ వాతావరణం ఏర్పడింది. నాలుగు పథకాలకు మళ్లీ వేళల్లో దరఖాస్తులు వచ్చాయి. గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులకు రసీదు ఇవ్వడం లేదు, దీనిపైన అధికారుల నుంచి సరైన సమాధానం లేకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
శుక్రవారం దిండి మండల కేంద్ర పరిధిలోని కందుకూరు గ్రామంలో గ్రామ సభ రసాభాసగా సాగింది.
గ్రామసభలో అధికారులకు, గ్రామ నాయకులకు మరియు ప్రజలకు మధ్య కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం ఇచ్చిన హామీల ను నెరవేర్చకుండా, కాలయాపన చేస్తున్నారని, రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఏకపక్షంగా నిర్ణయించార నీ అర్హులకు జాబితాలో చోటు లేకుండా అన్హరులకే పెద్దపీట వేశారని, వాళ్లకే ప్రభుత్వ పథకాలు అందేలా జాబితాలో పేర్లు ఉన్నాయని అధికారులతో కందుకూరు గ్రామ ప్రజలు ఘర్షణ పడ్డారు, దీంతో అధికారులు ప్రజలతో ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా కృషి చేస్తా మనీ అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App