
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ లో ఈ రోజు యుకెజి విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని సిరి ఫంక్షన్ హాల్ లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ – రజనీ దేవి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన కార్యక్రమానికి హాజరైన విద్యార్థినీ విద్యార్థులు మరియు పోషకులను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్నారుల జీవితంలో ఈ ప్రీ ప్రైమరీ విద్య అనేది అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
ఎందుకంటే వారి ఉజ్వల భవిష్యత్ కి పునాది ఇక్కడే నిర్మితమవుతుందని, ఈ మూడు సంవత్సరాలు నర్సరీ, ఎల్ కె జి, యు కె జి తరగతుల్లోనే వారికి ముందు తరగతులకు అవసరమైన ప్రాథమిక జ్ఞానం లభిస్తుందన్నారు. అలాంటి ప్రత్యేకత కలిగిన ఈ యుకెజి ని పూర్తి చేసుకొని వచ్చే సంవత్సరం ప్రైమరీ విద్య లోకి ప్రవేశించడం అనేది వారికి ఒక మధురానుభూతిని కలిగిస్తూ, ఒక గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోవాలనే ఆలోచనతో ఈ రోజు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు యుకెజి విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమం విజయవంతం చేయడంలో కృషి చేసిన ఉపాధ్యాయినీలను అభినందించారు. తమ చిన్నారి యుకెజి విద్యార్ధులకు ఒక తీయని జ్ఞాపకంగా మిగిలేలా గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించిన గాయత్రి విద్యా సంస్థల యాజమాన్యాన్ని పోషకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్, పిఇటి స్రవంతి, ఉపాధ్యాయినీలు సౌమిని, రాజమణి, ఆఫ్రీన్, రమ్య, విద్యార్థినీ విద్యార్థులు, పోషకులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
