
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఎన్.టి.పి.సి టౌన్షిప్ లో గల శ్రీ చైతన్య హై స్కూల్ విద్యార్థులు ఐదవ తరగతి నుంచి ఆరవ తరగతిలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో పాఠశాల యాజమాన్యం గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రాం ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఐదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులు సాధించి ప్రైమరీ నుండి హై స్కూల్ లోకి ప్రవేశిస్తున్నందున అభినందనలు తెలియజేశారు.
వైస్ ప్రిన్సిపల్ నమ్రత మాట్లాడుతూ శ్రీ చైతన్య సి బ్యాచ్ గురించి విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రైమరీ ఇన్చార్జ్ శైలజ ప్రోగ్రాం ని దగ్గర ఉండి నిర్వహించడంతోపాటు విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీన్ అనిల్ కుమార్,అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నరేంద్ర కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
