
త్రినేత్రం న్యూస్ జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం. కోటిలింగాల కోటేశ్వర స్వామి వారినీ మంగళవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సంధర్బంగా రేపు జరగనున్న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు.అనంతరం మహా శివరాత్రికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా ప్రైవేటు కంపెనీ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన బట్టలు మార్చుకునే షెడలను ప్రారంభించారు
ఈ సందర్భంగా షెడ్ నిర్మాణాన్ని పూర్తి చేసిన కంపెనీ యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తున్నమని,అదే విధంగా సి ఎస్ ఆర్ ఫండ్స్ కూడా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం,మరియు కోటిలింగాల దేవస్థానం,మరియు ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగించాలని,ఎన్నికల అనంతరం కంపెనీ డైరెక్టర్ ను కలిసి సి ఎస్ ఆర్ నిధులను ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని వారిని కోరడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
