సీ.ఎం.ఆర్.ఎఫ్ & కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందించడమే ప్రభుత్వ ధ్యేయం
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సారాద్యంలో సాగిస్తున్న ప్రజా ప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమ పథకాలాన్ని పేదలకు అందించడం లక్ష్యంగా పనిచేస్తుందని
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్ . కే గార్డెన్స్ లో శుక్రవారం రోజున పెద్దపల్లి మండలం మరియు పట్టణానికి సంబంధించిన 72 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు (₹72,01,052) 72 లక్షల 1 వెయ్యి 52 రూపాయల విలువ గల చెక్కులను అలాగే 664 మంది లబ్దిదారులకు ₹1.54 కోట్ల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ తాను గెలిచిన సంవత్సరం కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో పెద్దపల్లి నియోజకవర్గానికి దాదాపు 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మంజూరు చేయడం మన అదృష్టమని, ప్రజల దీవెనలతో గెలిచిన తాను ప్రతిక్షణం ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తున్నానని నియోజకవర్గంలో ఎక్కడ అవినీతి లేకుండా పాలన సాగిస్తున్నారని, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి తన సమయంలో ఎక్కడ జరగదని ఉదాహరణ ధాన్యం కటింగ్ లేకుండా కొనుగోలు చేయడం జరిగిందని ఇసుక మాఫియా మట్టి మాఫీ లేకుండా తాను నీకంటూ గా ప్రజలకు ఫ్రీగా ఇస్తాను పంపిణీ సాగిస్తున్నానని మనకు ముఖ్యంగా జిల్లా కేంద్రానికి బస్ డిపో మంజూరు అవడం మన ప్రాంతానికి బస్సు సౌకర్యం అన్ని గ్రామాలకు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. సంవత్సరం కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన నియోజకవర్గానికి వినలేని అభివృద్ధి పనులు మంజూరు చేసినారని రానున్న కాలంలో గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ప్రజలు సైతం తన వెంట ఉన్నంతకాలం తాను నిజాయితీగా పాలన సాగిస్తానని సందర్భంగా పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి తహసీల్దార్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App