TRINETHRAM NEWS

ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల జరిగిన పదవ జోనల్ స్పోర్ట్స్ గేమ్స్ కు విద్యార్థులు కు చదువుతోపాటు క్రీడల్లోను రాణించేలా ప్రోత్సహించాలని శాసనమండలి చీప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, అన్నారు.
వికారాబాద్ జిల్లాలోని శివ రెడ్డి పేట (అనంతగిరిపల్లి) సాంఘిక సంక్షేమ గురుకుల బాలల పాఠశాల/కళాశాల ఆవరణలో 10 వ జోనల్ స్థాయి అండర్ 14, 17, 19 బాలుర క్రీడా పోటీలను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, లతో కలిసి శాసనమండలి చీప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ప్రారంభించారు. ముందుగా వివిధ పాఠశాలల విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ ద్వారా అతిధులకు స్వాగతం పలికారు. క్రీడా పోటీల్లో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుండిచిలుకూరు,మొయినాబాద్, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, గౌలుదొడ్డి, కందుకూర్ కొడంగల్, కొందుర్గు, పరిగి, శంషాబాద్, పెద్దముల్, శివారెడ్డిపేట్ ల నుండి 12 పాఠశాలకు సంబంధించిన 971 మంది విద్యార్థులు పాల్గొనున్నారు.జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి చీప్ విప్ మాట్లాడుతూ…. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకొని ఉన్నత శిఖరాలనుఅధిరోహించాలాన్నారు క్రీడలనుప్రశాంతవాతావరణంలో నిర్వహించాలని నిర్వాహకులకు ఆయన సూచించారు. క్రీడల్లో గెలుపు, ఓటములను సర్వ సాధారణంగా భావించి తమ ప్రతిభనుఇంకామెరుగుపరుచుకునే విధంగా క్రీడల్లో తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థుల్లో వారి ప్రతిభను గుర్తించి ఆసక్తి ఉన్న రంగాల్లో మంచి శిక్షణ అందించాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. అంతేకాకుండా జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో క్రీడల్లో పోటీపడే విధంగా విద్యార్థులను సిద్ధం చేయాలని ఆయన కోరారు. క్రీడల్లో రాణించినట్లయితే ఉద్యోగల్లో కూడా ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వం తో పాటు మానసికంగా బలపడతారని ఆయన తెలిపారు. కళాశాల ఆవరణలో వాలీబాల్ క్రీడను ప్రజా ప్రతినిధులతో కలిసి శాసనమండలి చీప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 12 పాఠశాలల విద్యార్థులు బీ.డీ,లు పీ,ఈ,టీ,లు అని ప్రిన్సిపల్ డి రమాదేవి, తెలియజేశారు. ఈ కార్యక్రమం అంతా కూడా డిప్యూటీ సెక్రటరీ ప్రమోద్, మరియు జోనల్ ఆఫీసర్ నిర్మల, పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుంది.

అనంతరం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని బిటిఎస్ కాలనీలో నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ను చీప్ విప్ ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల బాలల పాఠశాల/కళాశాల విద్యా సంస్థల జోనల్ ఆఫీసర్ నిర్మల, ఆర్డిఓ వాసు చంద్ర, తహసిల్దార్ లక్ష్మీనారాయణ, కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి, వికారాబాద్ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల సాంఘిక సంక్షేమ గురుకుల బాలల పాఠశాల/కళాశాల విద్యార్థులతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App