
Trinethram News : AP: ఈబీసీ నేస్తం లబ్దిదారులకు గుడ్న్యూస్ సీఎం వైఎస్ జగన్ గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించే బహిరంగ సభా వేదికగా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం నిధులను విడుదల చేయనున్నారు. కంప్యూటర్ బటన్ నొక్కి అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఈబీసీ నేస్తం పథకం కింద అగ్రవర్ణ పేదల్లోని 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది
