Going directly to people to solve people’s problems
ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరావేస్థాం…
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి పట్టణంలోని 04 & 23 వార్డులను మంగళవారం రోజున ఉదయం స్థానిక మున్సిపల్ అధికారులతో మరియు కౌన్సిలర్లతో కలిసి పెద్దపల్లి పట్టణ సమస్యల పరిష్కారానికై వార్డులను సందర్శించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లి పట్టణంలోని 4 మరియు 23 వార్డుల్లో సందర్శించినప్పుడు వార్డు సమస్యలను అడిగి తెలుసుకుంటూ వార్డులోని సమస్యలను దశలవారీగా పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని త్వరలోనే ఆర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వస్తాయని హామీ ఇచ్చారు.
వార్డుల్లో డ్రైనేజ్ సమస్య రోడ్డు సమస్యలు రానున్న రెండు నెలల్లో పూర్తి చేస్తామని గత ప్రభుత్వం నిర్లక్షం వలనే పెద్దపల్లి పట్టణం సమస్యలా వలయంగా తయారు కావడం జరిగింది అని అమృత్ పథకంలో రూ. 22 కోట్లతో చేపట్టే పనులకు టెండర్లు పిలవడం జరిగిందన్నారు. పట్టణంలో ఎక్కడ కూడా సమస్యలు లేకుండా చేసి, త్రాగు నీటి, రోడ్ల, డ్రైనేజీ, పరిశుభ్రత సమస్యలు రాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామన్నారు. పెద్దపల్లి పట్టణంలో సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, స్ధానిక కౌన్సిలర్ల దృష్టికి తీసుకువచ్చినా తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని హామీ ఇచ్చారు.
నాలుగవ వార్డు సందర్శనలో భాగంగా స్ధానిక కౌన్సిలర్ కొంతం శ్రీనివాస్ రెడ్డి గారు ఇటీవల కాలంలో గుండె పోటు తో మరణించగా వారిని స్మరించుకుంటూ వారి నివాసంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను కలవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వివిధ శాఖల అధికారులు, పట్టణ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App