
నగరి త్రినేత్రం న్యూస్
గుర్తుతెలియని కారు ఢీకొనడంతో బాలిక మృతి… బాలుడు కు తీవ్ర గాయాలు…
నగరి రూరల్ మండలం వి కే ఆర్ పురం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం ఘటన చోటుచేసుకుంది…
తిరుపతి చెన్నై జాతీయ రహదారి పై శనివారం సాయంత్రం 4.00 గంటల ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని కారు ఢీకొట్టడంతో ఎం. ఎన్ కండ్రిగ ఎస్టీ కాలనీకి చెందిన జి .నోమేశ్వరి (10 ) అక్కడకక్కడే మృతి చెందింది.యమ్ ఎన్ గ్రామానికి చెందిన గోపి పిల్లలగా గుర్తింపు…బాలుడు జి. మహేష్ వయసు 14 సంవత్సరాలు తడుకుపేట జడ్పీ హైస్కూల్ నందు 9వ తరగతి చదువుతున్నారు.
తల్లిదండ్రులు వికేఆర్ పురంలో కూలీ పని చేస్తున్నారుతల్లిదండ్రులు వద్దకు వెళ్లడానికి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని కారు ఢీకొట్టడంతో ప్రమాదంలో బాలిక మృతి…దీంతో ప్రధమ చికిత్స నిమిత్తం బాలుడిని నగరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు…బాలుడికి తలకి బలమైన గాయం తగలడంతో తీవ్ర రక్తస్రావం అయింది… ప్రస్తుతం పరిస్థితి నిలకడ ఉన్నదని వైద్యులు నిర్ధారించారు.
ఢీకొన్న గుర్తుతెలియని కారును సీసీ కెమెరాల ఫుటేజ్ ను చెక్ చేస్తున్న స్థానిక పోలీస్ శాఖ నగరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగరి త్రినేత్రం న్యూస్ చిత్తూరు జిల్లా ఇన్చార్జి ఎల్ కే రామన్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
