General development and welfare of the people is the aim of public governance – State Women’s Commission Chairperson Nerella Sharada
*43 వేల 125 మంది రైతులకు 273 కోట్ల 82 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి
*మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ద్వారా జిల్లా మహిళలకు 60 కోట్ల 32 లక్షలు ఆదా
*అర్హులందరికీ గృహ జ్యోతి, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకాల అమలు
*యాసంగి లో 733 కోట్ల విలువైన 3 లక్షల 35 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
*142 కోట్లతో రామగుండం లో 355 అదనపు పడకల ఆసుపత్రి భవనం నిర్మాణం
*ఇందిరా మహిళా శక్తి క్రింద మహిళల ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటు
*అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతుల కల్పన
*ఉత్తమ ప్రతిభ కనబర్చిన 140 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేత
*స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గోన్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్
పెద్దపల్లి , ఆగస్టు -15: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ప్రజల సమగ్రాభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అన్నారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. గురువారం ఉదయం ముఖ్య అతిథి పోలీసు వందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ చేసారు. అనంతరం ముఖ్య అతిథి తన సందేశాన్ని తెలియజేసారు.
ఏ పనైనా ఆగవచ్చు కానీ వ్యవసాయ ఆగకూడదు (Everything can wait but not agriculture) అనే దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మాటలను తమ ప్రభుత్వం విశ్వసించి రైతు సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత కల్పించిందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తుందని , మన పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు లక్షా 50 వేల వరకు రుణాలు ఉన్న
43 వేల 125 మంది రైతులకు 273 కోట్ల 82 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేశామని, నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల ఖాతాలలో నిధులు జమ అవుతాయని మహిళా కమీషన్ చైర్ పర్సన్ తెలిపారు.
వరదలు కరువు వంటి ప్రకృతి విపత్తుల కారణంగా రైతులు నష్టపోకుండా పంట బీమా పథకం ద్వారా తమ ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతుల తరఫున చెల్లించాల్సిన ప్రీమియం పూర్తిస్థాయిలో ప్రభుత్వమే చెల్లించి ప్రతి పంటకు బీమా సౌకర్యం కల్పిస్తామని అన్నారు. యాసంగి పంట కొనుగొలుకు 311 కొనుగొలు కేంద్రాలు ఏర్పాటు చేసి 54 వేల 288 మంది రైతుల వద్ద నుండి రూ.733 కోట్ల విలువ గల 3 లక్షల 35 వేల 616 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి 48 గంటలలోగా చెల్లింపులు చేసామని తెలిపారు
వానాకాలం పంట నుంచి సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్ ప్రభుత్వం ప్రకటించిందని, రైతు నేస్తం కార్యక్రమం ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు రైతులకు అవసరమైన సలహాలు సూచనలు నేరుగా అందిస్తున్నామని , జిల్లాలో 1976 ఎకరాలలో కొత్తగా ఆయిల్ పామ్ పంట విస్తరణ దిశగా కృషి చేస్తున్నామని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని, ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధీకారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించిందని తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టిందని, దీని ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు కోటి 31 లక్షలకు పైగా జీరో టికెట్లను జారీ చేశామని, మహిళలకు 60 కోట్ల 32 లక్షల రూపాయలను ఆదా అయ్యాయని పేర్కొన్నారు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా నాటి నాటికి పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారం మహిళలపై పడకుండా గ్యాస్ సిలిండర్ ను సబ్సిడీపై
500 రూపాయలకే ప్రజా ప్రభుత్వం సరఫరా చేస్తుంది, మన పెద్దపల్లి జిల్లాలో ఇప్పటివరకు లక్షా 59 వేల 743 గ్యాస్ సిలిండర్లను సబ్సీడి పై సరఫరా చేసి సంబంధిత లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలలో 4 కోట్ల 77 లక్షల రూపాయలు సబ్సీడీ సోమ్ము జమ చేశామని మహిళా కమిషన్ చైర్ పర్సన్ పేర్కొన్నారు.
గృహావసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ప్రభుత్వం మార్చ్ 1,2024న ప్రారంభించి ఇప్పటివరకు మనం జిల్లాలో 5 లక్షల 36 వేల 304 జీరో బిల్లులు జారీ చేసి, విద్యుత్ పంపిణీ సంస్థలకు 21 కోట్ల 69 లక్షల రూపాయలను గృహ జ్యోతి క్రింద చెల్లించడం జరిగిందని తెలిపారు. అర్హులైన లబ్ధి దారులందరికీ గ్యారెంటీ పథకాలు చేరే విధంగా ఎంపీడీవో కార్యాలయం, సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజా పాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేశామని మహిళా కమిషన్ చైర్ పర్సన్ తెలిపారు.
ఒక సంఘం అభివృద్ది కి, ఆ సంఘంలోని మహిళలు సాధించిన అభివృద్ది కొల మానమని దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ అన్నారు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద మన జిల్లాలో మహిళా సంఘాలచే 30 స్టిచ్చింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి పాఠశాల విద్యార్థుల ఏకరూప దుస్తులను కుట్టించామని , జిల్లాలో 4 అమ్మ క్యాంటీన్ ల 12 రకాల వివిధ వ్యాపార, వాణిజ్య యూనిట్ల నెల కొల్పెందుకు ప్రణాళికలు రుపొందిస్తున్నామని అన్నారు.
జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో అమృత్ – 2 క్రింద 314 కోట్లు 92 లక్షల ఖర్చు చేస్తూ వాటర్ సంపుల నిర్మాణం, పైప్ లైన్, బల్క్ ఫ్లో మీటర్, వాటర్ ట్యాంకులు, సివర్ ట్రంక్ మెయిన్ నిర్మాణం మొదలగు పనులను, టి. యూ.ఎఫ్.ఐ.డి.సి నిధుల క్రింద 174 కోట్లు ఖర్చు చేస్తూ అవసరమైన సిసి రోడ్లు, సిసి డ్రైన్లు, సెంట్రల్ లైటింగ్,మున్సిపల్ భవన నిర్మాణాలు మొదలగు అభివృద్ది పనులను చేపట్టామని తెలిపారు.
రాజీవ్ ఆరొగ్య శ్రీ పథకాన్ని ప్రజా ప్రభుత్వం బలోపేతం చేసిందని, ఆరొగ్య శ్రీ కవరేజిని ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని, 163 కొత్త వ్యాధులను ఆరొగ్య శ్రీ పరిధిలోకి తెచ్చామని , మన జిల్లాలోని ప్రజలకు కార్పోరెట్ స్థాయి వైద్యం అందించేందుకు రామగుండంలోని సింగరేణీ వైద్య కళాశాల పరిధిలో 142 కోట్ల వ్యయంతో 355 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు.
భావితరాల మెరుగైన భవిష్యత్తుకు మంచి విద్యే పునాది. మన జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా 13 కోట్ల 78 లక్షలు ఖర్చు చేసి 493 పాఠశాలలో అభివృద్ది పనులు పూర్తి చేశామని తెలిపారు.
అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలను కల్పిస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం సమీకృత రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలను నిర్మిస్తామని తెలిపారు.
ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ క్రింద ప్రస్తుతం సంవత్సరం జిల్లాలోని ఎస్సీ విద్యార్థులకు కోటి 25 లక్షల 38 వేల రూపాయలు, 528 మంది ఎస్టీ విద్యార్థులకు 17 లక్షలు,300 మంది మైనార్టీ విద్యార్థులకు 62 లక్షల రూపాయిలు, 2594 మంది బీసీ, ఈబీసీ విద్యార్థులకు 3 కోట్ల 8 లక్షలకు పైగా నిధులను విడుదల చేశామని అన్నారు.
మన యువతకు అవసరమైన నైపుణ్యాలు అందించి ప్రపంచస్థాయి పోటీలకు సన్నద్దం చేసే దిశగా ఎంపిడిఓ ప్రాంగణంలో ఆధునిక టాస్క్ సెంటర్ ను ఏర్పాటు చేశాం.
యువత డ్రగ్స్, గంజాయి వంటి వాటికి అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, డ్రగ్స్ అంశాన్ని ప్రజా ప్రభుత్వం ఎటువంటి పరిస్థితులలో ఊపేక్షించడం జరుగదని, డ్రగ్స్ పై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి స్వచ్చంద సంస్థలు, ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు అందిస్తూ డ్రగ్స్ బూతాన్ని తెలంగాణ నుండి శాశ్వతంగా తరిమి వేయాలని మహిళా కమీషన్ చైర్ పర్సన్ పిలుపునిచ్చారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని చిన్నారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. పెద్దపెల్లి మహాత్మ జ్యోతిబాపూలే విద్యార్థులు దేశ్ దేశ్ కీ రంగీలా, గాయత్రి స్కూల్ విద్యార్థులు మేరా భారత్ కో సలాం జిల్లా ప్రజా పరిషత్ బాలికల పాఠశాల విద్యార్థులు ఇదే మన భారతం, కాకతీయ అరబిందో స్కూల్ విద్యార్థులు ఇండియా వాలే , శ్రీరాంపూర్ మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం విద్యార్థులు జగతి సిగల్ లో జాబిలమ్మ అనే గేయాల అనిపై చేసిన ప్రదర్శనలు అలరించాయి.
అనంతరం ముఖ్య అతిథి జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబర్చీన 140 మంది ఉద్యొగస్తులకు ప్రశంసా పత్రాలను అందజేసారు.
51 కోట్ల 30 లక్షల విలువ గల ఆస్తుల పంపిణీ
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఇందిరా మహిళ శక్తి కార్యక్రమంలో భాగంగా చైతన్య జ్యోతి జిల్లా మహిళా సమాఖ్య సంఘం పరిధిలోని 433 సంఘాలకు 45 కోట్ల 14 లక్షల 80 వేల రూపాయల విలువ గల బ్యాంకు లింకేజీ రుణం చెక్కు చెక్కును ముఖ్య అతిథి అందించారు, 48 మెప్మా సంఘాలకు 5 కోట్ల 23 లక్షల 50 వేలు విలువ చేసే రుణాలను పంపిణీ చేశారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద 58 కుటీర పరిశ్రమల ఏర్పాటుకు 92 లక్షల 50 వేల రుణాన్ని అందజేశారు.
అనంతరం ముఖ్య అతిథి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్ లను పరిశీలించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో ఎంపికైన 9 వినూత్న ఆవిష్కరణలను ముఖ్య అతిథి పరిశీలించి ఆవిష్కర్తలను ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ హర్ష, ప్రిన్సిపాల్ జిల్లా, సెషన్స్ జడ్జి డాక్టర్ డి. హేమంత్ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు, మహిళ కమిషన్ రాష్ట్ర సభ్యురాలు కటారి రేవతి రావు, అదనపు కలెక్టర్లు జె .అరుణశ్రీ, శ్యాం ప్రసాద్ లాల్, డి.సి.పి. ఎం.చేతన, ఆర్.డి.ఓ. బి.గంగయ్య, కలెక్టరేట్ ఏ. ఓ. శ్రీనివాస్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App