TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నీయోజకవర్గo. అనపర్తి. ది. వి. 22-03-2025 అనగా శనివారం జి.బి.ఆర్ ఏసి క్యాంపస్ నర్సరీ, ఎల్.కే.జీ, యూ.కే.జీ, మరియు 1,2 తరగతుల విద్యార్థినీ విద్యార్థులకు ‘రెయిన్ బో కిడోస్’ కార్యక్రమం అత్యంత ఘనంగా , వినూత్నంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జి.బి.ఆర్ గ్రూఫ్ ఆఫ్ స్కూల్స్ డీన్, జి.హరిప్రసాద్, హైస్కూల్ హెచ్.ఎం. రామారావు , ప్రైమరీ హెచ్.ఎం. భువనేశ్వరి, ప్రీ ప్రైమరీ హెచ్.ఎం కామాక్షి, ఏసి క్యాంపస్ హెచ్.ఎం.

వరలక్ష్మి , ఇన్చార్జి వెంకటరెడ్డి , వెంకటరెడ్డి, అకడమిక్ కో- ఆర్డినేటర్ ప్రశాంతి రెడ్డి, ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా జరిగినది.ఈ వేడుకలలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆద్యంతం ఆకట్టుకున్నాయి.ముఖ్యంగా విద్యార్థుల్లో వారి వారి గ్రాండ్ పేరెంట్స్ పట్ల ప్రేమను,గౌరవభావాన్ని పెంపొందించేలా విద్యార్థులచే వారిని సన్మానించడం ఒక విశేషం.ఈ కార్యక్రమంలో జూనియర్ కాలేజీ పూర్వపు ప్రిన్సిపల్స్, గొలుగూరి జగన్నాథ రెడ్డి , ఉమావెంకట రెడ్డి, డిగ్రీ కాలేజ్ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి,
డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, ఎన్ పెద అబ్బాయి రెడ్డి, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్, స్వామి, గేమ్స్ డైరెక్టర్ మహేంద్ర రెడ్డి , ఏ. ఓ ఆచారి, పాల్గొన్నారు. జి.బి.ఆర్ విద్యాసంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంటు,తేతలి ఆదిరెడ్డి(కొండబాబు) ఈ సంధర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు చిన్నతనం నుండి పెద్దల పట్ల ప్రేమాభిమానాలు, గౌరవం కలిగించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని ఆకాంక్షించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

GBR's grand 'Rainbow Kiddos'