TRINETHRAM NEWS

బోయిన్పల్లి లో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 8 : బోయిన్పల్లి డివిజన్ హస్మత్ పేటలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు శుక్రవారం రాత్రి ఘనంగా జరిగాయి. స్థానిక నాయకుడు అల్తాఫ్ రాజా ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.నిర్వాహకులను రమేష్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వరరావు, దండగుల యాదగిరి, అంజాద్ అలీ , సయ్యద్ ముస్తఫాలీ, అస్లాం పాషా, షహన్ష, జహంగీర్ , ఆఫ్టర్, ముస్తఫా, సాజాద్, ఇజాజ్, అస్లాం సోఫీ, అక్రమ్, శివ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Garmi Sharif Festivals