Trinethram News : గద్వాల పట్టణం:-గద్వాల పట్టణంలో జమ్మి చెడు జమ్ములమ్మ అమ్మ వారి పరుశురాముడు స్వామి బ్రహ్మోత్సవాలు (గద్వాల జాతర, పౌర్ణమి) సందర్భంగాశనివారం ఉదయం వేద బ్రాహ్మణులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే దంపతులకు స్వాగతం పలికారు.నడిగడ్డ ఇలవేల్పు అమ్మవారికి ఎమ్మెల్యే దంపతులు బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ జమ్ములమ్మ అమ్మ వారికి దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని పవిత్రమైన కృష్ణా నీటితో 108 కలశం తో అభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులు మొదటి పూజ నిర్వహించి అమ్మవారి ఆశీస్సులను పొందడం జరిగింది. పరుశురాముడు స్వామి దేవాలయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే దంపతులు.ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని వివిధ ప్రాంతాల నుంచి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అమ్మవారిని దర్శించుకుని వారి మొక్కులను చెల్లించుకోవడం జరుగుతుందన్నారు. కావున వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మూడు నెలలపాటు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. నడిగడ్డ ప్రజల ఇలవేల్పు అయిన అమ్మవారి దర్శనానికి ప్రతి మంగళవారం, శుక్రవారం వేలాది మంది భక్తులు వస్తారని, నడిగడ్డ ప్రాంతంలో జమ్ములమ్మ అమ్మవారు ప్రతి ఇంటిలో ఏ శుభకార్యం జరిగిన మొదటగా అమ్మవారిని మొక్కలను చెల్లించుకుని వివాహ శుభ కార్యాలను నిర్వహించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు.శ్రీ అమ్మవారి ఆశీస్సులతో గద్వాల నియోజకవర్గ ప్రజలందరికీ, రైతులు వ్యవసాయ రంగంలో పాడి పరిశ్రమలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గాయత్రి సతీష్, కౌన్సిలర్ శ్రీమన్నారాయణ, ఆలయ కమిటీ డైరెక్టర్స్ అభిలాష్, ఓం ప్రకాష్, ఈవో పురేందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జములమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన గద్వాల ఎమ్మెల్యే దంపతులు
Related Posts
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న రెండు ట్రావెల్స్ బస్సులు
TRINETHRAM NEWS ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న రెండు ట్రావెల్స్ బస్సులు ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు Trinethram News : సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లాలో హైదరాబాద్ – విజయవాడ 65వ జాతీయ రహదారిపై SV కళాశాల సమీపంలో…
నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో పో
TRINETHRAM NEWS నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో పో Trinethram News : నిర్మల్ : బస్సులో అడ్డంగా లగేజీ పెట్టిన మహిళ ప్రయాణికురాలితో కండక్టర్ వాగ్వాదం నిర్మల్ డిపోకు (టీఎస్ 18…