Trinethram News : ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల జగన్ యాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఇక 13వ రోజైన శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఏటుకూరు బైపాస్ రోడ్డులో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు.
ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల నుంచి బయలుదేరి బస్సులో సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్ చేరుకుని నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డుకు చేరుకుని మధ్యాహ్న భోజనానికి విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు చౌటుగుంట సర్కిల్ కు చేరుకుని వీఐపీ రోడ్డు మీదుగా ఏటుకూరు బైపాస్ రోడ్డుకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
ఈ సెగ్మెంట్ నుంచి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ప్రతిపక్ష తెలుగుదేశం తరఫున కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. అనంతరం తక్కెళ్లపాడు బైపాస్, పెదకాకాని బైపాస్ మీదుగా నంబూరు బైపాస్ రోడ్డు మీదుగా వెంగళరావు నగర్ వరకు చేరుకొని రాత్రి బస చేస్తారు. ఇక సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’లో భాగంగా పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖి ప్రారంభించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.