ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో మేడారం సమ్మక్క – సారలమ్మ మహాజాతరలో కమ్యూనికేషన్ సేవలు ఎంతో కీలకం కానున్నాయి.
మెరుగైన సేవలు అందించేందుకు BSNL సిద్ధమైంది.
జాతరలో సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు భక్తులకు ఉచిత వైఫై సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు.
భక్తులు అధికంగా ఉండే 16 ప్రధాన ప్రాంతాల్లో ప్రజలందరూ ఉచితంగా వైఫై సేవలను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.