
తేదీ : 03/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ప్రభుత్వ డి ఎల్ టి సి సహాయ సంచాలకులు యస్. ఉగాది రవి ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కేంద్ర ఫీల్డ్ టెక్నీషియన్, ఎయిర్ కండిషనర్ కోర్సులో మూడు నెలలపాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పదవ తరగతి ఆపైన ఉత్తీర్ణులైన వారు 18 నుండి 35 ఏళ్ల లోపు వారు అర్హులని, ఈనెల 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
