
కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం.
అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 22: అరకు నియోజకవర్గం,అరకు వ్యాలీ మండల కేంద్రంలో గల “ఐటిడిఏ ట్రైబల్ మ్యూజియం ఆవరణలో షాప్ నెంబర్ 18 నందు,తేజ మెడికల్స్ మరియు జనరల్ స్టోర్స్ మెయిన్ రోడ్ అరకు వ్యాలీ గేడ్డం నరసింగరావు సహకారంతో,శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో. ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని.అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం.చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటి చూపు లోపంతో ఇబ్బంది పడుతున్న,అవ్వాతాతలకు,ప్రభుత్వ ఉద్యోగులు,రిటైర్డ్ ఉద్యోగులు,పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరియు ఉపాధ్యాయులు కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గేడ్డం నరసింగరావు సహకారంతో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన వైద్యులను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే కంటి పరీక్షలు చేసుకోవడం జరిగింది,
ఈ కార్యక్రమంలో శంకర్ ఫౌండేషన్ రిలేషన్షిప్ మేనేజర్ చంద్రశేఖర్, మాజీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు కమ్మిడి అశోక్, చిన్నలబుడు గ్రామపంచాయతీ సర్పంచ్ బురిడీ ఉపేంద్ర ,అనంతగిరి మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పాంగి అప్పారావు. సమర్ధి దేశ్ముఖ్,మయూరి రాజు,దామోదర్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
