Trinethram News : TG . ఖమ్మం
గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు
తెలంగాణ:రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులలో ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లా నుంచి కోదాడ, సూర్యాపేట, ఇల్లందు, కొత్తగూడెం సత్తుపల్లి ప్రయాణించాలంటే గంటల కొద్దీ బస్టాండ్లో వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రయాణికులకు సరిపడా బస్సుల సౌకర్యం కల్పించాలని పలువురు వేడుకుంటున్నారు.