
చంద్రబాబు నటన ముందు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ సరిపోరు
కూటమి ప్రభుత్వం చాలా అబద్దాలు ఆడింది
నాలుగు లక్షల ఉద్యోగాలు ఎవరెవరికి ఇచ్చారు
6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు ఎక్కడ వచ్చింది? ఎక్కడ పెట్టారు?
1.4 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు ఎక్కడ పూర్తి చేశారు?
Trinethram News : 2029 కల్లా విజయవాడ విశాఖపట్నం మెట్రో రైలు పూర్తి చేస్తామన్నారు? అసలు ప్రాజెక్టు రిపోర్టు తయారు కాలేదు, కాస్ట్ ఎస్టిమేషన్ లేదు, భూగర్భ ప్రాజెక్ట్ లేదా ఫ్లైఓవర్ అది నిర్ధారించలేదు, బడ్జెట్ ఎంత అవుతుందో తెలియదు అలాంటప్పుడు 2029 కల్లా పూర్తవుతుందని ఎలా మీరు చెప్పగలరు అని ఆయన ప్రశ్నించారు.
అన్నా క్యాంటీన్లో ఎంతమందికి అన్నం పెడుతున్నారు? ఎంతమంది తింటున్నారు? వివరాలు చెప్పగలరా అని ప్రశ్నించారు.
తలసరి ఆదాయం 31,000 పెరిగిందని అన్నారు.. దానికి వివరణ ఇవ్వాలని హర్ష కుమార్ అన్నారు..
ల్యాండ్ టైటిల్ యాక్టర్ రద్దు చేయడం, గ్యాస్ సబ్సిడీ, ఉచిత ఇసుక ఈ మూడు తప్ప మిగిలిన ఏ హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది
ప్రజలు వీటిని అన్నిటినీ గమనించి రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కచ్చితంగా ఓటమి చూస్తుందని హర్ష కుమార్ అన్నారు.
హామీలు నెరవేర్చలేని ఏ ప్రభుత్వమైనా ప్రజలు తిరస్కరిస్తారని, రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుందని విమర్శించారు.
మొత్తం 35 పథకాల్లో కేవలం రెండు మూడు తప్ప మిగిలిన పథకాలను అంతంతమాత్రంగా వదిలేశారు
గ్రూపు 2 నోటిఫికేషన్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందనుకొని అప్లికంట్స్ ని మోసం చేశారు. మరలా యధావిధిగా కొనసాగుతుందని ప్రకటించం వెనకాల నిరుద్యోగులను మోసం చేసినట్లే అని ఆయన అన్నారు.
ఎలక్షన్ ముందు జీవి రెడ్డి తన డిబేట్స్ లో కూటమికి బాగా ప్రమోట్ చేశారని తన సహాయంతో అధికారంలో వచ్చిన తర్వాత అతనికి సైబర్ నెట్ చైర్మన్ పదవి ఇచ్చారని, ఆ తర్వాత జీవీరెడ్డి స్వయంగా తన రాజీనామా చేసి రాజకీయాల నుంచి కూడా తప్పించుకుంటున్నట్లుగా ప్రకటించడం వెనకాల ప్రభుత్వము యొక్క విధి విధానాలు జీవీరెడ్డి కి నచ్చకపోవడమేనని ఆయన ఆరాపించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
