CM సొంత నియోజకవర్గంలో అధికారులు అడుగు పెట్టలేని దుస్థితి: మాజీ ఎమ్మెల్యే ఆనంద్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజవకర్గం లగచర్ల గ్రామంలో ఓ ఫార్మాసంస్థ భూసేకరణ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణకు వచ్చిన కలెక్టర్ మీద దాడి జరగటం దురదృష్టకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.
సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని దుద్యాలలో 1,350 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించి ఫార్మా కంపెనీకి ఇవ్వాలని నిర్ణయించింది అయితే ఇక్కడి రైతుల నుండి పట్టాభూములను సేకరించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
రైతులు తమ ప్రాణం లాంటి భూములను ఔషధ కంపెనీకి ఇచ్చేదే లేదని తెగేసి చెబుతునే ఉన్న పట్టింపు లేని ఈ ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తూ వారిని తీవ్ర మనోవేదనకు గురించేసింది, ఈ క్రమంలోనే వారు తిరగబడ్డారు. ఘటన కి పూర్తి బాధ్యత CM రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి, రైతుల పట్ల, అధికారుల పట్ల ఆయనకు ఉన్న కపట ప్రేమ బట్టబయలు అయింది.రేవంత్ రెడ్డి తప్పుడు నిర్ణయాల వల్ల అటు ప్రజలు, ఇటు అధికారులు ఇబ్బందులకు గురయ్యారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App