హైదరాబాద్ : ఫిబ్రవరి 08
హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది. ఐదేళ్ల పాటు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్‌గా పని చేసిన తెలంగాణ ఉద్యమకారుడు బాబా ఫసియుద్దీన్ ఆ పార్టీకి ఈరోజు రాజీనామా చేశారు..
రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యం లేదంటూ ఆవేదనతో పార్టీ మారుతు న్నానని ప్రకటించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో ప్రాణహాని ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు…